mt_logo

సజావుగా ధాన్యం కొనుగోలు-సమస్యలేమి లేవన్న రైతులు

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.. సజావుగా ధాన్యం కొనుగోలు, సంతృప్తి కరంగా రైతులున్నారు,  రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. రైతు శ్రేయోభిలాషిగా సీఎం కేసీఆర్, తెలంగాణ సలహా ధాన్యం కొనుగోలు దేశంలో ఎక్కడా లేదు, రైతుల కోసమే ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం అన్నారు. రైతులతో మాట్లాడిన మంత్రులు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం తప్ప సమస్యలేమి లేవన్న రైతులు. ధాన్యం రవాణాకు సమయానుకూలంగా లారీలు వస్తున్నాయని చెప్పిన రైతులు.