mt_logo

హైదరాబాద్ అత్యద్భుతం… కేటీఆర్ మార్గ నిర్దేశకులు… : మంత్రి కేటీఆర్ పై ప్రశంసల జల్లు

ఎలక్ట్రిక్‌ కార్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈని హైదరాబాద్‌కు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫార్ములా-ఈ హైదరాబాద్‌కు రావడంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై టెక్‌మహీంద్ర సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ హర్షం వ్యక్తం చేశారు. ‘కేటీఆర్‌.. మీరు ఎప్పుడూ మార్గ నిర్దేశకులు. మీ సాహసోపేతమైన నిర్ణయాన్ని చూసి నేను ఆశ్చర్యపోలేదు, ఆనందించాను. భారతదేశానికి రేసింగ్‌ స్ఫూర్తిని అందించిన ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈకి ధన్యవాదాలు, సొంతగడ్డపై మహీంద్ర రేసింగ్‌కు చీర్స్‌ చెప్పాలని ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. గ్రీన్‌బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ సోల్హెమ్‌ కూడా స్పందించారు. ‘హైదరాబాద్‌ అత్యద్భుత నగరం. గ్రహం మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మోటార్‌ స్పోర్ట్‌ సిరీస్‌ ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ భారత్‌కు రానుంది. కేటీఆర్‌ గారూ… ఈ రాష్ట్రంలో మరిన్ని ఎలక్ట్రిక్‌ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు, తెలంగాణలో గ్రీన్‌ పురోగతిని చాటిచెప్పేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం’ అని తనట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *