mt_logo

మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకం : మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబాబాద్: అమ్మాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.కుట్టు శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడిన మంత్రులు. నిర్ణీత కాలంలో అన్ని రకాల కుట్టు శిక్షణను అందుతున్నాయని చెప్పిన మహిళలు.కుట్టు శిక్షణ ద్వారా తమకు మనోధైర్యం పెరిగిందన్న మహిళలు.స్వతంత్రంగా బతకగలమన్న నమ్మకాన్ని పెంచిన కుట్టు శిక్షణ అని చెప్పిన మహిళలు. మంత్రి ఎర్రబెల్లి ద్వారా తమకు ఈ శిక్షణతో పాటు వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పిన మహిళలు. కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నందుకు  తమకు మరింత ఉపాధి ఉద్యోగ అవకాశాల  లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన మహిళలు. 

మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకం : మంత్రి నిరంజన్ రెడ్డి

ఉచిత శిక్షణను రాష్ట్రవ్యాప్తం చేస్తే బాగుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి సరిపోయే పథకం ఉచిత కుట్టు శిక్షణ. ఈ శిక్షలతో మహిళా సాధికారత సాధ్యం అన్నారు. 

పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ ను, చేపట్టిన మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.