Mission Telangana

సీఎం కేసీఆర్ కు ధన్యవాద సభ – పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

తెలంగాణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో..మే 16న ఛలో ఇందిరా పార్క్ సీఎం కేసీఆర్ కు ధన్యవాద సభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున దేశంలోనే అత్యంత ఎతైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా అన్నీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించే ఛలో ఇందిరా పార్క్. సీఎం కేసీఆర్ కు ధన్యవాద సభకు సంబంధించిన పోస్టర్. కరపత్రాన్ని శనివారం నాడు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.

హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో చేపట్టిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ రాజీవ్ సాగర్, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, వైస్ చైర్మన్ గంధం రాములు, కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాద సభ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి,  శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ లు జోగినిపల్లి సంతోష్ కుమార్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లు బాల్క సుమన్,గువ్వల బాలరాజు, ఏపీ బీఆర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ తో పాటు పలువురు హాజరు కానున్నారు.