mt_logo

 పౌరుల భద్రతే  తెలంగాణ ప్రభుత్వ బాధ్యత

శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం

రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాలలో, ప్రభుత్వం రూ.59,200 కోట్లు కేటాయించింది

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.775 కోట్లతో 551 కొత్త పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మాణం 

పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరికరాలు

పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు

రాజధాని నగరంలో అడుగడుగునా సిసి టీవీల ఏర్పాటు

రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం

• తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 48,096 పోస్టుల భర్తీ• రాష్ట్రంలో మహిళల భద్రతకు 331 షీ టీమ్స్, 12 భరోసా కేంద్రాలు

హైదరాబాద్, జూన్ 04 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకు విశేష ప్రాధాన్యతనిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతా, సంరక్షణ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ విభాగాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ పోలీసుశాఖను ఆధునీకరించేందుకు, పోలీసు సిబ్బందిలో సానుకూల మార్పులు తీసుకురావడానికి పలు చర్యలు చేపట్టింది. 

దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో నిర్మితమైంది. బంజారాహిల్స్‌ లోని ఈ అద్భుతమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో లక్ష కెమెరాల పుటేజీని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం  అందుబాటులో ఉన్నాయి.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి, నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపేలా ఆర్డినెన్స్‌ తెచ్చిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.  క్రైట్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (CCTNS) ను ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ.

        శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు మొత్తం 10 లక్షల 66 వేల 792 సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం జరిగింది. ప్రతీ వెయ్యి మందికి  30 క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్‌  అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్  టాప్‌ ప్లేస్‌లో నిలిచి, ప్రపంచంలో 16వ స్థానం పొందింది.

   తెలంగాణా రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో వివిధ రకాల నేరాలలో గణనీయమైన తగ్గుదల సాధిచడం జరిగింది. వీటిలో ప్రధానంగా, స్వలాభం కొరకై జరిగే మర్దర్లు 32 .94 శాతం తగ్గాయి. రాష్ట్రంలో 19 .42 శాతం హత్యలు తగ్గగా, మహిళలపై జరిగే నేరాలలో 40 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా వరకట్న సంబంధిత హత్యలు గణనీయంగా తగ్గాయి.

శాంతి, భద్రతల పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను రాష్ట్రంలో కొత్తగా 11 పోలీస్ జిల్లాలు, 7 కమిషనరేట్ లు, 175 పోలీస్ స్టేషన్లు, 38 సర్కిళ్లు, 24 సబ్-డివిజన్లు,4 ఐ.ఆర్. బెటాలియన్లు, 2 మల్టీ జోనులు, 7 జోనులను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితోపాటు సైబర్ నేరాలు, నార్కోటిక్స్ నియంత్రణలకై కొత్తగా, టీ.ఎస్. సైబర్ సెఫిటీ బ్యూరో, టీ.ఎస్. నార్కోటిక్స్ బ్యూరో, టీ.ఎస్. కమాండ్ కంట్రోల్ సెంటర్ లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.

        ప్రసిడెన్షియల్ ఆర్డర్ -2018 ప్రకారంగా అధికారులను మల్టీ జోన్లు 1, 2 లకు కేటాయించడం ఏవిధమైన విమర్శలు గానీ, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా కేటాయించడం జరిగింది.

మహిళా భద్రతా విభాగంలో షీ టీమ్స్, భరోసా, షీ భరోసా సైబర్ ల్యాబ్, మానవ అక్రమ రవాణా నివారణ తో పాటు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ప్రవేశపెట్టి సమర్దవంతంగా అమలు చేస్తోంది. మహిళలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై వారు ప్రత్యేక్షంగా గాని, పరోక్షంగా గాని భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా గత సంవత్సరంలో మొత్తం 5145 ఫిర్యాదులు అందగా వాటిని సమర్దవంతంగా పరిష్కరించడం జరిగింది.

పోలీసు బలగాల పటిష్టత:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంటే 2004 నుంచి 2014 వరకు బడ్జెట్‌లో రూ.30,348 కోట్లు హోం శాఖకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాలలో, ప్రభుత్వం రూ.59,200 కోట్లు కేటాయించింది, ఇది దాదాపు రెండింతలు, శాంతి భద్రతల నిర్వహణ,  పౌరుల భద్రత మరియు భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రాధాన్యతను సూచిస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు బలగాలను బలోపేతం చేసేందుకు వివిధ ర్యాంకుల వారిగా 31,970 పోస్టులు సృష్టించబడ్డాయి.

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 48,096 పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్‌లు జారీ చేయడం జరిగింది. 28 వేల 277 పోస్టులు భర్తీ చేశారు.  మిగిత పోస్టుల భర్తీ ప్రక్రియ దశలో ఉన్నాయి. పోలీస్ శాఖలో 2014 నుండి ఇప్పటి వరకు 1,32,492 మంది పోలీసు సిబ్బందికి అధునాతన శిక్షణ ఇవ్వడం జరిగింది. 

మౌలిక సదుపాయాల కల్పన:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.775 కోట్లతో 551 కొత్త పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించారు.  111 భవనాలు పురోగతిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఫ్లీట్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడానికి 2014 నుంచి ఇప్పటి వరకు 16,154 వివిధ రకాల వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది.పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్పించడానికి రెండు 3-టైర్ డేటా సెంటర్లు, స్టేట్ లెవల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ సైబర్ ల్యాబ్స్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అందించిన పరికరాలు.

 మొత్తం పోలీసు సిబ్బందికి 66,374 సీయూజీ సిమ్‌లను అందిండం జరిగింది. బాడీ వోర్న్ కెమెరాలు, బ్రీత్ ఎనలైజర్‌లు, కంప్యూటర్ ట్యాబ్‌లు, హై ఎండ్ కంప్యూటర్లు, BDDS పరికరాలు, ANPR, వీడియో అనలిటిక్స్ (VMS).  CCTVలు – తెలంగాణ రాష్ట్రంలోని 774 పోలీస్ స్టేషన్లలో CCTVలను ఇన్‌స్టాల్ చేయడానికి రూ.79 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇవే కాకుండా టెక్నాలజీ యాప్‌లు, లాజిస్టిక్స్, కిట్ ఆర్టికల్స్, బెల్ ఆఫ్ ఆర్మ్స్, పోలీస్ ఎస్టేట్‌లు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్‌పై సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం 5 ప్రత్యేక వెబ్ ఆధారిత ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌లు ప్రారంభించబడ్డాయి. 

తెలంగాణా స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అనేది భారతదేశంలోని మొదటి ప్రయోగశాల, ఈ విధానాన్ని అన్వేషించి, సైకోట్రోపిక్ పదార్థాల సూచన మెటీరియల్‌ని దిగుమతి చేసుకుంది. వరంగల్ మరియు కరీంనగర్ RFSLలతో పాటు TSFSL యొక్క 11 ల్యాబ్‌లలో తాజా మరియు ఆధునిక పరికరాలు కొనుగోలు చేయబడ్డాయి. దీని ఫలితంగా త్వరిత విశ్లేషణ, కేసులను త్వరితగతిన పరిష్కరించడంతోపాటు ఖచ్చితత్వం నిర్వహించడం జరిగింది.

మహిళల భద్రతకు షీ టీమ్స్ , భరోసా కేంద్రాలు ఏర్పాటు :

మహిళల భద్రతకు షీ టీమ్స్ నవంబర్ 24, 2014న ప్రారంభించారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా ఉన్నది. రాష్ట్రంలో 331 షీ టీమ్స్ చురుకుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో గృహ హింస,  బాలలపై లైంగిక వేధింపుల బాధితులకు కౌన్సెలింగ్, ఉపశమనం అందించడానికి 12 భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి.

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల వేగవంతమైన ధృవీకరణను ప్రారంభించడానికి దేశంలోనే మొట్టమొదటి సాఫ్ట్‌ వేర్ అప్లికేషన్ ను పోలీస్ శాఖలో ప్రారంభించడం జరిగింది. దేశంలో మరే ఇతర రాష్ట్రాలలో ఈ సౌకర్యం లేదు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానం చేసిన అవార్డులలో గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోనే నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర పోలీసు సాంకేతికత ఆధారిత కార్యక్రమాల కోసం 60కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆటోమేటెడ్ ఫింగర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AFIS)ని కొనుగోలు చేసింది. మొట్ట మొదటి రాష్ట్రం మన తెలంగాణనే. జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా మన రాష్ట్రం నిలిచింది. నేరాన్ని గుర్తించడం, పరారీలో ఉన్న నేరస్థులను గుర్తించడం, నేరస్థులు, పునరావృత నేరస్థుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పరికరం గుర్తిస్తున్నది. ప్రపంచ దేశాలలో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రాష్ట్రం 2014నే ప్రారంభించింది. హోంగార్డుల డ్యూటీ అలవెన్స్ రోజుకు రూ.300 నుంచి రూ.921కి పెంచిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది. హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి, ఇది ట్రాఫిక్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తేనున్నది.