ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందని అన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనన్నారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి బాధాకరం అని పేర్కొన్నారు. నాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయాల్లో ఇది దురదృష్టకరం, లోకేష్ పరిస్థితిని అర్ధం చేసుకోగలనన్నారు.
మమ్మల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు
రాజకీయాలు వేరయినా ఆయన కుటుంబం భాదను నేను అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. వారికి నా సానుభూతి (my sympathies are with them), నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై మేము కూడా చాలా ఆందోళన చెందాం అని గుర్తు చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు మమ్మల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి మానసిక స్థితి ఉంటుందో అర్థం చేసుకోగలనని బాధ వ్యక్తం చేశారు. హైదరాబాద్ శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆందోళన చేయడం వద్దు అన్నాను. రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయాలలోకి తెలంగాణలో లాగవద్దు అన్నానని పేర్కొన్నారు.