mt_logo

కేసీఆర్‌ను ఆశీర్వదించిన అరవై సభలు.. జన నేతకు అడుగడుగునా జన నీరాజనాలు

  • ప్రతి సభలో ప్రగతి మాట
  • పల్లెలన్నీ కేసీఆర్ బాట…
  • హుస్నాబాద్ నుంచి చేర్యాల దాకా
  • అక్టోబర్ 15 నుంచి నవంబర్ 18 వరకు
  • దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు..
  • ప్రజాఆశీర్వాదసభల్లో ప్రతిధ్వనిస్తున్న 
  • ప్రగతి శంఖారావం..
  • ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటు వేయాలి
  • ఎవరేందో ఎరుకతో గెలిపించాలి

కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.  చంద్రశేఖర్ రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, అందులో భాగంగా  పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలు నేటితో 60 కి చేరుకున్నాయి. 33 రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు, జన ప్రవాహంతో బీఆర్ఎస్ విజయోత్సవల సభలను తలపిస్తున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా పల్లె పల్లె నుంచి లక్షలాదిగా తరలివస్తున్న  జనంతో నియోజకవర్గాల సభలు జాతరను తలపిస్తున్నాయి. ప్రతీసారి సాధారణ ఎన్నికలకు ముందు ప్రారంభించినట్టే ఈ సారి ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రజాఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 

అక్టోబర్ 15 నుంచి మొదలైన ఈ సభలు రెండు విడతలుగా సాగి నవంబర్ 18 నాటికి 33 రోజులు పాటు 60 సభలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతీ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. అధినేత సీఎం కేసీఆర్ చెప్తున్న 60 ఏండ్లుగా జరగని అభివృద్దిని పదేళ్లలో చేసి చూపించిన రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని సీఎం కేసీఆర్ రాష్ర ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ సభలో గత ప్రభుత్వాలకు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడాలు గుర్తించాలని సీఎం ఇస్తున్న పిలుపుకు ప్రజలు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. తమ ప్రాంతానికి సీఎం కేసీఆర్ వస్తున్నాడని తెలిసిన ఆయా నియోజకవర్గాల ప్రజలు ఏది దొరికితే అది పట్టుకుని సభలకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు వినడానికి , చెట్ల చిటారు కొమ్మలు, బిల్డింగ్ లు ఎక్కి వింటున్నారు. ఆటపాటలతో, కళాకారులు నింపుతున్న ఉత్సాహంతో సభ ప్రాంగణాలు కదం కలుపుతున్నాయి. 

తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న సమయంలో ఎట్లైతే ప్రతి పల్లె కదిలి వచ్చిందో అంతకు మించిన చైతన్యంతో సీఎం కేసీఆర్ ప్రసంగాలు వినడానికి ఊర్లకు ఊర్లే తరలివస్తున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజాఆశీర్వాద సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పడు, మడమ తిప్పడు అనే అచంచల విశ్వాసమే ప్రజలు పెద్ద ఎత్తున సభలకు వచ్చేలా చేస్తుంది. ఇచ్చిన మాట కోసం సీఎం కేసీఆర్ ప్రాణం పోయినా వెనుకాడరనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఈ నమ్మకం, విశ్వాసం  ఒక్క రోజుతో కేసీఆర్ మీద ఏర్పడినది కాదు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచే తెలంగాణ జనం కేసీఆర్ పై విశ్వాసంతో వెంట నడిచింది, ఇప్పటి వరకు నడుస్తోంది.

రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోకి పంటలకు సంబంధించిన డబ్బులు జమ చేయడం వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలకు అవునంటూ ప్రజలు గళం కలుపుతున్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి అభివృద్ధి జరగలేదని తేల్చి చెబుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాను… చెప్పే మాటలను విని వుట్టిగనే పోవద్దు. చెప్పిన మాటలను గ్రామాల్లో చర్చకు పెట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. 

కేసీఆర్ పిలుపుకు ప్రజలు ఆలోచనచేస్తూన్నరు. తెలంగాణ అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే..అని పోల్చిచూస్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వాలు కేసీఆర్ మాదిరిగా అభివృద్ది విషయంలో కనీసం ఆలోచన కూడా చేయలేదని, తెలంగాణ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా గెలిపించాలంటోంది తెలంగాణ రైతాంగం… యావత్ సమాజం.

గతంలో ఏ పాకులైనా ఇప్పటివరకు బీఆర్ఎస్ పాలనలో ఇచ్చినట్లు వేలల్లో పెన్షన్ ఇచ్చారా? అంటూ కేసీఆర్  గారు ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో చెప్పడంతో ..నిజమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే పెన్షన్లు వేలల్లో ఇస్తున్నారని, బతికేందుకు సరిపడే మొత్తం అందుతున్నదని గ్రామాల్లో పెన్షనుదారులు, వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. కేసీఆర్ కాకుండా మిగతావారు గెలిస్తే పెన్షన్లు వస్తాయో..రావో అనే భయం పెన్షన్లు పొందుతున్న వారిలో వ్యక్తమవుతున్నది.

గతంలో ఎట్లుండె తెలంగాణ .,.ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు తెలంగాణలో సరైన పంటలు లేవు. కరెంటు లేదు. రైతుబంధు లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే మారిందని కేసీఆర్ తో ప్రజలు ఏకీభవిస్తున్నారు. ఎక్కడ చూసినా పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని, ధాన్యపు రాశులు సిరులు కురిపిస్తున్నాయని అందరి నోట అదే మాట వినిపిస్తోంది. 

మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, సాగునీటి  ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటికి , త్రాగునీటికి కొరత లేకుండా పోయిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్లు, కరెంటు, సాగు నీళ్ల మీద ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో గుర్తుచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావానికి  ముందు త్రాగునీటి ఇబ్బందులు చాలా ఉండేవి. ట్యాంకర్లతో తరలించడం లేకుంటే కిలోమీటర్లు నడిచి బిందెపై బిందె ఎత్తుకుని మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు పోయేవాళ్లు. అప్పుడు తెలంగాణ అట్ల ఉండే ? ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి పైసా ఖర్చు లేకుండా నల్లా నీళ్లు వస్తున్నాయి. అప్పటి లెక్క ఇప్పుడు మంచినీళ్ల గోస ఉందా అని సభల్లో కేసీఆర్ ప్రజలను ప్రశ్నిస్తుంటే ముక్తకంఠంతో అంతా నీళ్ల సమస్య లేదంటూ చేతులెత్తి సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ప్రతిపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను లక్షలాదిమంది సాక్షిగా ఎండగడుతున్నారు.

24 గంటల కరెంటు కావాలా? కాంగ్రెస్ వాళ్లు అంటున్నట్లు 3 గంటల విద్యుత్ కావాలా? అంటూ చెన్నూరు ప్రజాఆశీర్వాదసభలో కేసీఆర్ అడుగుతుంటే ప్రజలందరూ 24 గంటలు కరెంటు కావాలంటూ చేతులెత్తి జై కొట్టారు.  24 గంటలు కరెంటు కావాలనుకుంటున్నవాళ్లు చేతులు ఎత్తాలని సీఎం కేసీఆర్ కోరగా సభలోని ప్రతీ ఒక్కరూ చేతులు ఎత్తి సంఘీభావం తెలిపారు. ధరణి విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బోథ్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చెప్పుతున్నట్లు ధరణి ఉండాలా…వద్దా? అని ప్రజలను ప్రజా ఆశీర్వాద వేదికలపై నుంచి అడుగుతుంటే ఉండాలంటూ ముక్తకంఠంతో ప్రజలందరూ చెబుతున్నారు. ధరణి ఉండాలనుకునేవారు చేతులెత్తండంటే ..సభలో ఉన్నవారందరూ చేతులెత్తి సంఘీభావం తెలిపారు.

చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభలో రైతుబంధు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..  రైతుబంధు పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను, రైతు బంధు పేరిట దుబారా చేస్తున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారని.. మరి రైతుబంధు ఉండాలా? వద్దా? అనే అంశంపై ప్రజలను సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే, రైతుబంధు ఉండాల్సిందేనంటూ ప్రజలు ముక్తకంఠంతో సభ మారుమోగేలా నినాదాలు చేశారు. దళిత బంధు విషయం ప్రస్తావిస్తూ.. దళిత బంధు లాంటి పథకం పెట్టాలని, ఉచితంగా పది లక్షల సాయం చేయాలని, దళితుల జీవితాలు మార్చాలనే ఆలోచన గతోం ఎవరైనా చేశారా..అని చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభా వేదికపై నుంచి ముఖ్యమంత్రి చెబుతుంటే ప్రజలంతా చేతులెత్తి జై కొట్టారు. 

దళితులను వెలివాడలకు పరిమితం చేసింది కాంగ్రెస్ అంటూ సీఎం కేసీఆర్ విపక్షాలను విమర్శిస్తుంటే.. ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమేననే చర్చ దళిత సమాజంలో జరుగుతున్నది. అంతేకాకుండా గత పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా వాడుకున్నారు తప్ప.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నకే సీఆర్ విమర్శతో దళిత వర్గాలు ఏకీభవిస్తున్నాయి. అదేవిధంగా మైనారిటీలను కూడా గత పాలకులు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రసంగంపై ముస్లీం మైనారిటీ వర్గాలు నిజమేనంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలోనే తమకు సంక్షేమ పథకాలు, సరైన న్యాయం జరుగుతున్నదని ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎట్లుండే..ఇప్పుడు తెలంగాణ ఎట్లుందని బేరీజు వేసుకుంటూ..అభివృద్ది, సుస్థిర పాలన అందించే సీఎం కేసీఆర్ నే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని పార్టీ అధినేత ను ఎమ్మెల్యే లను నోటికొచ్చినట్టు బూతుకూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక పిచ్చికుక్కలాంటివాడని, వారి లెక్క దప్పిన మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చి నిలబెట్టుకున్న తనలాంటి వాడికి పిండం పెడుతానని దుర్మార్గంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించి ప్రజలే పిండం పెట్టాలని కోరారు. వచ్చిన తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు.