నిజామాబాద్ అర్బన్, శివాజీ నగర్ రోడ్ షో లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ 2000 పించన్ ఇస్తే, బీజేపీ వాళ్ళు బీడీపై జీఎస్టీ వేసింది. నీళ్ల కోసం అనేక కష్టాలు నాడు అనుభవించారు. ఇప్పుడు కష్టాలు లేవని స్పష్టం చేసారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది. గణేష్ బిగాల గెలిస్తే ఇక్కడే ఉంటాడు సేవ చేస్తాడని తెలిపారు. షబ్బీర్ అలీ వచ్చి ఇక్కడ ఉంటాడా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు స్థానాల్లోనే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. కేసీఆర్‌ను గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుందని సూచించారు. రాష్ట్రంలో కారు, నియోజకవర్గంలోనూ కారు ఉంటే.. అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని వివరించారు.