mt_logo

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ‘పజ్జన్న’

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.