mt_logo

టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ లేఖ

టెట్ పరీక్ష రుజుము తగ్గించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ రాశారు. అలాగే పరీక్ష నిర్వహణ 11 జిల్లా కేంద్రాల్లోన్నే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సుమన్ కోరారు.

సుమన్ రాసిన లేఖ యథాతదంగా 👇

ముఖ్యమంత్రి గారు, నమస్కారం. మీకు మనవి చేయునది ఏమనగా టెట్-2024 పరీక్ష ఫీజులను విద్యా శాఖ భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ. 200ల ఫీజు, రెండు రాసిన వారికి రూ. 300 ఫీజు మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ. 2000 లకు పెంచడం సరికాదు. పెంచిన ఫీజుల వల్ల నిరుపేద, మధ్యతరగతి అభ్యర్ధులపై చాలా భారం పడుతుంది.

అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. దీని వల్ల కూడా మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడతారు. దూరభారంతో పాటు ఆర్థికంగానూ భారం పడుతుంది. కావున మొత్తం 33 జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగలరని మనవి. 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకుని పెంచిన ఫీజులు తగ్గించగలరని కోరుతున్నాము.