mt_logo

బీజేపీ ఎమ్మెల్యే ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా

  • డీజీపీ కి మంత్రి కేటీఆర్ ఫోన్
  • ఈటెల రాజేందర్ భద్రత సమీక్ష చేయాలని ఆదేశం 

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఈటల సతీమణి జమునా రెడ్డి ఆరోపించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఈటల భద్రతపై ఆరా తీశారు. అవసరమైతే ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో సమీక్షించి భద్రత కల్పించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.