
- నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం
- మదర్ థెరిస్సా వారసులు మీరు
- మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిది
- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
నిజామాబాద్: నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారి సేవలను కొనియాడారు. మదర్ థెరిస్సా వారసులు మీరని ఎలాంటి కల్మషం లేకుండా పేషంట్స్ కి మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిదన్నారు. శుక్రవారం నాడు అంతర్జాతీయ నర్స్ ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ దవాఖాన లో నర్సులు, వైద్యబృందంతో కలిసి వేడుకల్లో పాల్గొని,కేక్ కట్ కట్ చేసి వారికి అంతర్జాతీయ నర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నర్సులను ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు.