mt_logo

కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలకు పూజ చేసి, సంతకం చేసిన సీఎం కేసీఆర్

  • విజయ తిలకం దిద్దిన గ్రామ మహిళలు
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు 
  • వేదాశీర్వచనం చేసిన పండితులు

తనకిష్టదైవమైన కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ (విజయ)పత్రాలు ఉంచి పూజలు చేశారు. శనివారం కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఆలయంలోకి సీఎం ప్రవేశించారు. నామినేషన్(విజయ) పత్రాలను ఆలయ అర్చకులకు అందించగా మూలవిరాట్టు వద్ద పత్రాలు ఉంచి సీఎం కేసీఆర్ గోత్ర నామాలు, సంకల్పంతో పూజలు నిర్వహించారు. 

అర్చకులు కేసీఆర్ చేతికి కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాల(విజయపత్రాల)పై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళలు విజయ తిలకం దిద్దారు. 

కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ హర్షధ్వానాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ విజయం తథ్యం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అత్యంత అభిమానంతో  గులాబీల వర్షం కురిపించారు. కాగా ప్రధాన ముఖద్వారం దక్షిణం వైపు ఉండటం ఇక్కడి కొనాయిపల్లి దేవాలయం ప్రత్యేకత.