mt_logo

 సింగరేణికి నేషనల్ స్థాయిలో అవార్డు

హైదరాబాద్‌: సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. అత్యుత్తమ జియో మైన్‌టెక్‌ ‘గ్లోబల్‌ రెయిన్‌బో’  అవార్డును సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం ఉత్తమ డైరెక్టర్,  కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందుకున్నారు. నేషనల్‌ టెక్నాలజీ డే వేడుకల్లో భాగంగా అత్యుత్తమ ఖనిజ కంపెనీలు, అధికారులను జియో మైన్‌టెక్‌ సంస్థ ఏటా గుర్తిస్తున్నది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం ఆ రాష్ట్ర పర్యటన శాఖ మంత్రి ఈ అవార్డును అందజేశారు. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, సీఎస్ఆర్ కార్యక్రమాలు, పర్యావరణ చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. గతేడాదిలోనూ 671 లక్షల బొగ్గు ఉత్పత్తి, 667 లక్షల బొగ్గు రవాణా చేసి రూ. 32,830 కోట్ల టర్నోవర్ సాధించి దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా సింగరేణి పేరు తెచ్చుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. వన ప్రేమికుడైన బలరాం సొంతంగా 15 వేల మొక్కలు నాటారు, కార్మికుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ డే నిర్వహించారు.