mt_logo

తెలంగాణాపై విషం చిమ్ముతున్న మోడీ

  • రేవంత్ రెడ్డి ఓ పిట్టల దొర
  • తెలంగాణా అంటేనే మోడీ విషం చిమ్ముతున్నాడు
  • కాంగ్రెస్, బీజేపీ లపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి
నకిరేకల్ నియోజక వర్గం రామన్నపేట మండల కేంద్రంలో 9 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపనకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే నైతికత కాంగ్రెస్, బిజెపి లకు ఎక్కడిదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఉద్యమ కాలంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాడు చంద్రబాబు కోసం తెలంగాణా బిడ్డల్ని కాల్చి చంపుతామంటూ రంకెలు వేసిన రేవంత్ రెడ్డికి ఆ సంబరాలలో పాల్గొనే హక్కు ఎక్కడిదని ఆయన దుయ్యబట్టారు. అదే ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకుల చెంతన చేరిన రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర  దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నకిరేకల్ నియోజక వర్గం రామన్నపేట మండల కేంద్రంలో తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన రోడ్ల విస్తరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.  కొనుక్కొచ్చుకున్న పదవితో ఊరేగుతున్న రేవంత్ కు అసలు తెలంగాణా పదం ఉచ్చరించే హక్కే లేదని ఆయన విరుచుకుపడ్డారు.
తెలంగాణా అంటేనే ప్రధాని మోడీ సర్కార్ విషం చిమ్ముతున్నప్పుడు సంబరాలు సెపరేట్ గా చేస్తామని ఇక్కడి బీజేపీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా ఒక్క సంతకంతో తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపింది కేంద్రము లోని బీజేపీ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు.500 మేఘావాట్లా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్న సీలేరు ను ఆంధ్రకు ధారాదత్తం చేసే కుట్రలో భాగమే ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిన బీజేపీ దశాబ్ది ఉత్సవాలను సెపరేట్ గా నిర్వహిస్తామని ప్రకటించడం హాస్యస్పదమని ఆయన విమర్శించారు.తెలంగాణా ఏర్పాటపై పై మోడీ నిండు సభలో మాట్లాడుతూ..  తల్లిని చంపి బిడ్డను బతికించినట్లు అని చేసిన వ్యాక్యాలు తెలంగాణా ప్రజల చెవుల్లో ఇప్పటికీ మారుమ్రోగుతున్నయన్నారు. అటువంటి బిడ్డను చంపి ఇప్పుడు ఇక్కడ బీజేపీ నాయకులు దినవారాలు చేసిన చందంగా దశాబ్ది ఉత్సవాలు సెపరేట్ గా చేస్తామని ప్రకటిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ పై నిప్పులు చెరిగారు.