
• మళ్లీ దేశంలో మోదీ ప్రభుత్వం రాకుండా ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలి
• బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను పనిచేయనివ్వడం లేదు
• దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మరో స్వాతంత్ర్య పోరాటం చేస్తాం
హైదరాబాద్, మే 27: ఢిల్లీ పరిపాలనను అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత నిర్వహించిన ప్రెన్‌కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ చర్చ జరిగింది, ఈ పోరాటం ఢిల్లీ కోసం మాత్రమే కాదు దేశం కోసం. ఈ పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అధికారాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉండే.. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే అధికారాలను తీసివేశారని అన్నారు. మేము 8 ఏళ్ళు ఢిల్లీ ప్రజల కోసం పోరాటం చేసామన్నారు. సుప్రీంకోర్టులో 8 ఏళ్ల తరువాత న్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు లో న్యాయం జరిగినా..దానిని కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది, సుప్రీంకోర్టు లోనే న్యాయం జరగకపోతే దేశ ప్రజలు ఎక్కడి వెళ్లి చెప్పుకోవాలి. మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు ఛాలెంజ్ చేస్తున్నారన్నారు. నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రాన్ని కేంద్రం పాలన చేసుకోనివడం లేదు. ED, సీబీఐ పంపి బెదిరించి ఎమ్మెల్యేలను కొంటారు ప్రభుత్వాలను కూల్చుతారు. నేను దేశమంతా తిరుగుతా…దేశ ప్రజల కోసం. రాజ్యసభ లో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని నాన్ బీజేపీ పార్టీలను కోరుతున్నాను. ఆర్డినెన్స్ ను అడ్డుకోని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.