mt_logo

మోడీ తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

  • కేంద్రం జీడీపీ రుణాల నిష్పత్తిని ఎపుడో దాటిపోయింది
  • మోడీ తీరు వల్ల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బ తింటోంది
  • చెప్పేది టీం ఇండియా చేసేది తోడో ఇండియా 

నీతి ఆయోగ్ ప్రతిష్ట ను కేంద్రమే దెబ్బ తీసిందనని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్  మెదక్ కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ను మెదక్ జిల్లా లో ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరణ ఒక ఎత్తు అయితే ఈ తొమ్మిదేళ్ల లో జరిగిన అభివృద్ధి మరో ఎత్తు, రాష్టం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం తో పాటు ఈ తొమ్మిదేళ్ల లో జరిగిన అభివృద్ధిని వివరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2 న తెలంగాణ అవతరణ దినోత్సవం మనందరికీ స్వాతంత్ర  దినం లాంటిదే అన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించు కోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ బీజేపీ లు తప్పుపడుతున్నాయి. ఆ రెండు పార్టీలకు ఉన్న ప్రేమ ఏ పాటిదో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. 

ఉద్యమం లో రాజీనామా లు చేయకుండా కాంగ్రెస్,బీజేపీ నేతలు పారిపోయారు, నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నారు,  సీఎం కేసీఆర్ యే కాదు.. మరో 10 మంది సీఎం లు కూడా నీతి ఆయోగ్ భేటీ కి హాజరు కాలేదు కదా? పీఎం మోడీ తీరు వల్ల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బ తింటోంది..ఆయన టీం ఇండియా అంటున్నారు కానీ తొడో ఇండియా అన్నట్టు వ్యవహరిస్తున్నారు అన్నారు మంత్రి. నీతి ఆయోగ్ చెప్పిన వాటిని కూడా కేంద్రం పాటించనపుడు దానికి ఏం  పవిత్రత ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు అని అడిగారు. నీతి ఆయోగ్ ప్రతిష్ట ను కేంద్రమే దెబ్బ తీసిందన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళితే ఏం లాభం? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లకు నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇస్తే మేము భేటీ కి వచ్చేవాళ్ళమేమో అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ  అప్పుల గురించి  తెగ బాధ పడిపోతున్నారు, కేంద్రం అప్పుల గురించి ఆలోచించండి కిషన్ రెడ్డి గారు అని గుర్తు చేసారు. కేంద్రం జీడీపీ రుణాల నిష్పత్తిని ఎపుడో దాటిపోయింది, మా అప్పులు పరిమిథుల్లోనే ఉన్నాయన్నారు.

పార్లమెంట్ ను రాష్ట్రపతి తో ప్రారంభించడమే కరెక్ట్, సచివాలయాన్ని సీఎం ప్రారంభించడమే కరెక్ట్ అన్నారు. గవర్నర్ ను రాష్ట్రపతి  నామినేట్ చేస్తారు, రాష్ట్రపతి ని దేశమంతా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా  కలిసి ఎన్నుకుంటుంది, పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్రం లో సచివాలయం ప్రారంభోత్సవం తో కొందరు పోలుస్తున్నారు.. అలాంటి వారు గవర్నర్ కు రాష్ట్రపతి కున్న తేడా తెలుసుకోవాలి అని తెలిపారు. పార్లమెంట్ కు బీ. ఆర్ అంబేద్కర్ పేరును ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. మేము సచివాలయానికి బీ ఆర్ అంబే డ్కర్ పేరు పెట్టినట్టే పార్లమెంటుకు పెట్టాలని మరో మారు డిమాండ్ చేస్తున్నాం అన్నారు.