సిద్దిపేట, జూన్ 15: రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల వద్ద 20 కోట్ల రూపాయలతో సిద్దిపేట పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి మరియు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు పాల సాయిరాం తదితరులు.