mt_logo

కేసీఆర్‌ను తరతరాలు గుర్తుపెట్టుకుంటారు: టీటీడీ చైర్మన్

  • స్వరాష్ట్రం సాధించి, సస్యశ్యామలం చేసి చరిత్ర సృష్టించారు
  • ఆకాశం నుంచి జలాశయాలను చూసి అబ్బురపడ్డ టీటీడీ  చైర్మన్

సిరిసిల్ల: హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల కు వచ్చేటప్పుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన జలాశయాలు, పలు అభివృద్ధి నిర్మాణాలు అన్ని చూపెట్టు కుంటూ వచ్చాను. ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ గౌరవెల్లి ప్రాజెక్ట్ అనంతగిరి జలాశయం మద్య మానేరు జలాశయాలను గగనతల నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి చూపించాను.కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతం మొత్తం ఎలా సస్యశ్యామలమైందో చూపించాను.నేను చెప్పింది అంత విన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒకటేమాట అన్నారు.

“తెలంగాణ సాధించినందు వల్ల కేసీఆర్ గారి పేరు ఎలా అయితే చరిత్రలో నిలిచిపోయిందో…. తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గారి పేరును తరతరాల పాటు గుర్తు పెట్టుకుంటారు.” అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాతో అన్నారు.

ఆ విషయాన్ని కేటీఆర్ సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు.