mt_logo

యాదాద్రి జిల్లా పోచంపల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ 

యాదాద్రి జిల్లా పోచంపల్లి లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. చేనేత యువ కళాకారుడు సైని భగత్ ఏర్పాటుచేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చేనేతలను కాపాడడం తో పాటు నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భగత్ బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు ప్రధానమంత్రి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పాలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసింది. పోచంపల్లి చేనేత పార్క్ ని పునరుద్ధరించి ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్ టైల్  క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమిష్టిగా పని చేయాలని కేటీఆర్ సూచించారు.