రూ. 18.75 కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1993-96 వరకు ఈ కాలేజీలోనే చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి నా విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నేను నిజాం కాలేజీలో చదువుకున్న విషయాన్ని గర్వంగా చెబుతాను. నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వపడతాను. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందన్నారు.
నిజాం కాలేజీకి ఇంకా పడే అవసరమైతే అదనపు నిధులను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ కి ఇబ్బంది రాకుండా ఈ భవన నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకోసం అదనపు అంతస్తుల్లో భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైతే ప్రత్యేకంగా అనుమతులు ఇస్తాం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడిక్‌మెట్ వరకు 16 కోట్లతో లింకు రోడ్ ను వెంటనే మంజూరు చేస్తున్నాం అన్నారు. ఉద్యమ కాలంలో అద్భుత కీలక పాత్ర వహించిన ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకుల పట్ల మాకు ప్రత్యేక గౌరవం ఉంది వారి కోసం ఎంత అవసరమైతే అంత సహాయం చేస్తాం అని హామీ ఇచ్చారు.