mt_logo

మంత్రి వేములకు మంత్రి కేటీఆర్ పరామర్శ

-మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి

వేల్పూర్: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారు ఇటీవల మృతి చెందగా..మంగళవారం నాడు ఆయనను నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. 

ఈ సందర్భంగా మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.