mt_logo

ఓటు మన తలరాతను, తాలుకా రాతను, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతది: సీఎం కేసీఆర్

ఓటు మన తలరాతను, తాలుకా రాతను, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతదని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం జనగామ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..  ‘‘ పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారు ఉన్నాడని తెలుసు కానీ. ఇంత హుషారుంటారనుకోలేదన్నారు.  మీరు ఏమీ లేదు సభ పెట్టి పోతే చాలు గెలిచి వచ్చిన తర్వాత అన్నీ అడుక్కుంట అని తెలిపిండు. దొడ్లకొచ్చినక గోద పెండ పెట్టకపోతదా అన్నట్లు పెద్ద లిస్ట్ చదివి చేస్తవా చస్తవా అన్నట్లు చేసిండని  హాస్యం చేశారు. ఈయన కన్నా ముత్తిరెడ్డి నయముండే, ఇటువంటి నాయకులుంటేనే మంచిది. ఎమ్మెల్యే కాకముందే  సమస్యలు తెలుసుకుని, మీ అందరితోని మాట్లాడి చాలా విషయాలు చెప్పినారు అవన్నీ కూడా చేయదగిన అంశాలే. చాలా గొప్ప విషయాలేమీ కావన్నారు. వాటన్నింటికి కూడా నేను చేసి పెడ్తాను.  మెడికల్ కాలేజీ వచ్చిందంటే నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీలు అన్ని వచ్చేస్తాయ్. అది రాష్ట్ర స్థాయి పాలసీ డిసిషన్ ఉండే. దానికి ఇబ్బందే లేదు అవన్నీ కూడా వస్తయ్ అని తెలిపారు. 

నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ 

చేర్యాల మావొళ్ల కెందుకో  రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది. అది ఏమంతా పెద్ద విషయం కాదు. రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుని తీసుకుని రండి. మీకు నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ చేసి పెడతా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు. యాది చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు కండ్లకు నీళ్లచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలుచెరుగులా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు మూల మూల తిరిగిన మీకు తెలుసు.  ఎనిమిది పది చోట్ల  కన్నీళ్లు తీసుకుని నేను ఏడ్చిన. చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజీ మీదనే ఎడ్చినా. అట్ల నేను ఏడ్చినటువంటి ప్రదేశాల్లో  బచ్చన్నపేట  మండల కేంద్రం ఒక్కటి. సిద్ధిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట, జనగామ వెళతా ఉంటే  బచ్చన్నపేటలో కొద్దిమంది కలిసి ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసున్న ఏరియా ఐదు నిమిషాలు మాట్లాడి పొమ్మని చెప్పినారు. నాలుగైదువందల మంది మాత్రమే ఉన్నారు. జనం కూడా లేరు. అక్కడ ఆ గినాం. నా ఎంబడి జీపులో మైకు ఉంటే అందులో ఎక్కి మాట్లాడుతున్నం. ఎదురుంగ చూస్తే  ఒక్క యువకుడు కూడా లేడు. అందరు ముసలివాళ్లే ఉన్నరు. ఒక్క యువకుడు లేడు ఏంది కథ అంటే.. ఒక్క  యువకుడు  కూడా లేడు సార్, ఇప్పటికే 8 ఏండ్లు కరువుపడి బచ్చన్నపేట చెరువు అడుగంటుకుని మొత్తం మునిగి పోయింది. ఎండిపోయింది . బావులల్లా కూడా నీళ్లు లేవు. బోర్లు కూడా  సరిగ్గా పోస్తలేవని గుర్తు చేశారు. 

ఆ దుస్థితి కళ్లారా చూసి నేను ఏడ్చినా.. 

8 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. బండి మీద బ్యారెళ్లు పెట్టుకుని అంటూ వాళ్లు ఏడ్చినరు  నాకు  కూడా దుఖం ఆగలేదు. దగ్గరలోనే గోదావరి ఉంటది  మనకు హక్కు ఉంటది.  రోజుకు ఒక్క రోజు స్నానం చేయనటువంటి పరిస్థితుల్లో ఉండటం బాధ అనిపించింది. యువకులు మొత్తానికి మొత్తం అన్నమో రామచంద్ర అంటూ పొట్ట చేత పట్టుకుని వలుసలు పోయినటువంటి దుస్థితి కళ్లారా చూసి నేను ఏడ్చినా.. ఈ  రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చాలా మాటలు చెస్తారు.  నేను ఒక్కటే చెప్పినా. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో ఒకటి లేదా రెండు ఎకనామిక్ గ్రోత్ సెంటర్లు కావాలే. ఎక్కడ అన్న పాయింట్ పెట్టండని అధికారులను కోరితే వారు వేరే వేరే పెట్టినారు అని గుర్తు చేశారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినా,  రెండవది భువనగిరి మీది పాయింట్ పెట్టినా. ఈ రెండు కూడా గ్రోత్ కారిడార్ అయినవని తెలిపారు.  

అత్యధికంగా వడ్లు పండించే తాలూకా జనగామ

నీళ్లు వచ్చిన తర్వాత పాత  వరంగల్ జిల్లాలో  చూసుకున్నట్లయితే అత్యధికంగా వడ్లుపండించిన తాలుకానే  జనగామ అని పేర్కొన్నారు. అప్పుడప్పుడు నేను తెలుసుకుంటావున్నా.. బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైందని. సార్ ఆనాడు ఎండిపోయింది కానీ 365 రోజులు నిండే ఉంటుందని అధికారులు చెప్పినారు. ముత్తిరెడ్డి గారు కూడా చెప్పినారు. చాలా సంతోషం  జనగామలో ఏదైతే జరుగాలనుకున్నామో. మంచినీళ్లు అమ్ముకునేటటువంటి దుకాణాలు సైతం కూడా ఉండెనో .. అవన్నీ మాయమైపోయి చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతా ఉంది.వందశాతం అభివృద్ధి చెంది తీరుతదని చెప్పారు. 

మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు

హైదరాబాద్ కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 60 కిలోమీటర్లు ఉంటది జనగామ. ఉప్పల్ దాటి ఘట్ కేసర్ దాటిన తర్వాత చాలా దగ్గరగా ఉంటది. భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీయల్ తోటీ, ఐటీ కారిడార్ తోని చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశముంటది. ఎన్నికలు చాలా సందర్భంలో వస్తయి. చాలా పోతయి. ఎవరో ఒకరు గెలుస్తా ఉంటరు.  ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు.  పరేషాన్ కావద్దని సూచించారు. ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటు వేయవద్దు. మన బావమరిది చెప్పిండో చుట్టం చెప్పిండో, మన మేనమామ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు. ఓటు అనేది మన తలరాతను మార్చుతది, తాలుకా రాతను మార్చుతది, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతది.  చాలా ముఖ్యమైన ఆయుధం. ప్రజా స్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దానిని ఎటు వినియోగిస్తమో మన ఖర్మ అటు వెళ్లిపోతది. ఎవడో వచ్చి ఏదో చెబితే నమ్మితే చాలా ప్రమాదమచ్చే ఆస్కారముందని తెలిపారు.

మల్లన్న సాగర్ కుండలా 

కొందరు ఆపద ముక్కులు మొక్కే వారు ఉంటరు.  ఐదేండ్ల రాక కనబడరు. ఎలక్షన్లు మోపు సంతోషమైన వార్త మీకు చెప్పేదేమంటే ముత్తిరెడ్డికి కూడా చెప్పినా  దేవాదుల ప్రాజెక్టు ద్వారా కాకుండా కాళేశ్వరం లింకైన మల్లన్న సాగర్ మీ ఎత్తుమీద కుండలాగానే  ఉంటది. 50 టీఎంసీల ప్రాజెక్టు నుంచి కూడా  టపాసుపల్లి రిజర్వాయరుకు లింకు చేస్తున్నం. దీనివల్ల ఎక్కడ కరువొచ్చినా జనగామలో కరువు రాదు. నిశ్చింతంగా ఉండాలని మనవి చేస్తున్నా. కొన్ని కొన్ని రిపేర్లు, పంట కాలువలు కావాలని కావాలని కోరినరు. అన్ని కూడా నా దగ్గర ఉన్నయ్. వాటన్నిటిని కూడా పరిశీలిస్తాను.  ఎట్లాగు నీళ్లు తెచ్చుకున్నాం. మొదటి దశ పనులు పూర్తి అయినయి. కొంత ఆయకట్టుకు అందుతా ఉంది.  రెండు మూడుల లిఫ్టులు పెట్టుకుంటే జనగామలో వందశాతం నీళ్లు వస్తాయి. అవి తెచ్చి నేను మీకు అప్పగిస్తా అని హామీ ఇచ్చారు. 

వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లాను చూడబోతున్నాం

దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగురవేయగానే చంద్రబాబు వెళ్లి  నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా పూర్తిచేయలే. దానిని ప్రపోజ్ చేయలే. నదిలో నీళ్లు పోతయి కాని అందించలేదు. సమ్మక్క బ్యారేజీ అని కట్టుకున్నాం.  ఏడున్నర  టీఎంసీల నీళ్లు బ్యారేజీలో  నిలబడి ఉంటాయి.  దీనిని వరంగల్ జిల్లాకే అంకితం చేసినం. ఎవరకు కరువొచ్చినా.. గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచే దేవాదుల కు నీళ్లు వస్తాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీటిని వాడవచ్చు. బంగారం తునక లాంటి, వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లాను చూడబోతున్నాం. దానికి తార్కాణమే మీరు పండించే పంటలని చెబుతున్న అని పేర్కొన్నారు.