mt_logo

రైతుబంధువును ఆదరించండి.. రాబందులను తరిమికొట్టండి: కేటీఆర్

పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే రైతుబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..? ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు..? అని అడిగారు. అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు…?  దుక్కి దున్నే బక్క రైతులపై  ద్వేషం ఎందుకు…?అన్నం పెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..? అని ఆవేదనతో అడిగారు. 

ధరణి మీద కక్ష ఎందుకు..?

కర్షకుడికి కడుపునిండా కరెంట్  ఇస్తుంటే చూసి  ఓర్వలేని బుద్ధి ఎందుకు..?  3 గంటల కరెంటు ఇస్తం..10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని  మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు..? అన్నారు. రైతు చేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు..? దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు..? కౌలు రైతులకు..అసలు రైతులకు మధ్య అగ్గి పెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు..? అని ధ్వ‌జ‌మెత్తారు. అన్నదాతలారా..మీ  వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండని అన్నారు. పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే  దరిద్రపు రోజులు కావాలా ..? ఆలోచించండని కోరారు. రైతుబంధువును ఆదరించండి..! రాబందులను తరిమికొట్టండని సూచించారు.