mt_logo

బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చిన బీజేపీ: మంత్రి కేటీఆర్ 

బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చిన బీజేపీ అని మంత్రి కేటీఆర్  తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అటు రూరల్ డెవలప్‌మెంట్, ఇటు అర్బన్ డెవలప్‌మెంట్..అటు ఐటీ అభివృద్ధి, ఇటు వ్యవసాయ అభివృద్ధి.. అటు పచ్చదనం వృద్ధి, ఇటు పరిశ్రమల వృద్ధి.. ఇటువంటి అరుదైన సమతూకం సాధించిన సమతుల్య రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 2004-14 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నింపిన ప్రభుత్వ ఉద్యోగాలు – 24 వేలు, అందులో తెలంగాణ వాటా 44% వేసుకున్న, తెలంగాణకు వచ్చినవి 10 వేల ఉద్యోగాలు.. అంటే సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలని స్పష్టం చేసారు. 

తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర ఏళ్లలో నింపిన ప్రభుత్వ ఉద్యోగాలు – లక్ష 32 వేలు, మరో 90 వేల ఉద్యోగాలు నియామక ప్రక్రియలో ఉన్నాయని,  ఇంత వేగంగా, ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ వివరించారు.బీసీ ప్రెసిడెంట్‌ను తొలగించి.. బీసీ సీఎం అంటుంది బీజేపీ.. బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తుంది. బీజేపీ ఈ సారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది.. ఒక వ్యక్తి సీఎం, పీఎం అయితే ఆ సామాజికవర్గానికి లాభం జరుగుతుంది అనుకోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదన్నారు. 

తెలంగాణ ప్రజల మీద మాకు అచంచల విశ్వాసం ఉంది.. మా బతుకు ప్రజల చేతుల్లో ఉంది.. మా తల రాత ప్రజలు రాస్తారు. మోడీ హయాంలో పేదరికంలో నైజీరియాను ఇండియా దాటేసిందన్నారు. దేశంలో వృద్ధిరేటులో తెలంగాణ టాప్ 5లో ఉందని తెలిపారు. ఒక్క పైసా అప్పు చేసినా ఉత్పదాక రంగం మీద పెట్టారు సీఎం కేసీఆర్.

కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతుంది అక్కడి ప్రభుత్వం. మేం పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదు.. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టేవారు. రేపు ఎప్పుడు అయినా పోతాడు ఏమో చూడాలి ? కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు సమతూకం కోల్పోతాయని అన్నారు. మేం పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదు.. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టేవారు. రేపు ఎప్పుడు అయినా పోతాడు ఏమో చూడాలి ? అని మంత్రి అన్నారు.