ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కు (28న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని బీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది, రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు,
ఈ సందర్బంగా 2018 లో విస్తృతంగా ఎన్నారైలు ప్రచారాన్ని నిర్వహించామని అలాగే ఈసారి కూడా ఈ ఎన్నికలలో అటు సోషల్ మీడియా కాంపెయిన్తో పేరు ప్రత్యక్షంగా కొన్ని నియోజకవర్గాలలో ఎన్నారైలు పర్యటించి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తారని అన్నారు. ఈ కార్యక్రములో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతారని రాబోయే ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలి అనే దానిపై దిశా నిర్దేశం చేస్తారు అని అన్నారు.