గత పాలకుల హయాంలో మింగుడు బంధు మాత్రమే ఉండే అని సీఎం కేసీఆర్ అన్నారు. వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి వచ్చిన ఎన్నికలని గుర్తు చేసారు. కొందరు వచ్చి అవాకులు , చెవాకులు వాడుతున్నారని మండి పడ్డారు. తెలంగాణ మీద కాంగ్రెస్ వారికి పట్టి లేదనన్నారు. వారికి తెలంగాణ పెత్తనం కావాలి. తెలంగాణలో అధికారం కావాలే. తెలంగాణ ప్రజల సంక్షేమం కాని అభివృద్ధి కాని పట్టలేదని సూచించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వర్ధన్నపేటను పట్టించుకోలేదని అన్నారు.
ఆరూరి రమేష్ ప్రజల్లో ఉండే వ్యక్తి
ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఐనవోలు, హసన్ పర్తి మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకున్నాం అని పేర్కొన్నారు. ఆరూరి రమేష్ ప్రజల్లో ఉండే వ్యక్తి అని స్పష్టం చేసారు. ఇటీవలే రూ. 160 కోట్లు తెచ్చి వర్ధన్నపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని సంతోషాన్ని వ్యక్తం చేసారు. షాట్ కట్ మెథడ్‌లో కాంగ్రెస్ రావాలని చూస్తుంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తేల్చి చెప్పారు.
రైతుబంధు, దళితబంధు పుట్టించిందే కేసీఆర్
వర్థన్నపేటలో రింగ్ రోడ్డుకు పూలింగ్ ఉండదు. ఎవరి జాగాకు నష్టం ఉండదని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. నేను చెప్పిన మాటలను మీ గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు. రైతుబంధు దుబారానా మంచి కార్యక్రమాలు మీరే చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుబంధు వద్దని చెబుతూ ఉంది, మూడు గంటల కరెంటుతో పొలం పారుతదా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు. రైతుబంధు, దళితబంధు పుట్టించిందే కేసీఆర్ అని పేర్కొన్నారు.
40 గ్రామాల ప్రజలకు సాదాబైనామా
మింగుడు బంధు గత పాలకుల హయాంలో ఉండేదన్నారు. వ్యవసాయ రంగంలో మిషన్ కాకతీయ తీసుకున్నాం. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం అని తెలిపారు. అబద్ధాలు విని మోసపోవద్దని హెచ్చరించారు. రెండు సార్లు ఆరూరి రమేష్‌ను గెలిపించారు. ఒక సారి 80 వేలతో, మరోసారి 90 వేలతో గెలిపించారు. ఈ సారి లక్ష దాటాలి. నా మెజారిటీ కన్నా ఎక్కువ రావాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎట్ల ఉండే ఇప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ అని అడిగారు. విలీనం అయిన 40 గ్రామాల ప్రజలకు సాదాబైనామా ఇప్పించే బాధ్యత నాదే . ఎన్నికల తర్వాత అమలు చేస్తాం. అభివృద్ధికి నిధులు ఇస్తాం అని చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలే అని సూచించారు.