mt_logo

శ్రీనివాస్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్: మంత్రి కే తారక రామారావు తన ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్) కానుగుల శ్రీనివాస్ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. శ్రీనివాస్ తల్లి గారు కానుగుల రాములమ్మ గత నెల 18వ తేదీన పరమాపదించారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ గారు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఈరోజు శ్రీనివాస్ కుటుంబాన్ని హయత్ నగర్ లోని ఆయన ఇంటిలో పరామర్శించారు. రాములమ్మ గారి చిత్రపటానికి నివాళి అర్పించిన కేటీఆర్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, వారికి తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.