ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది. కాగా పోయిన ఏడాది భారత్ 101వ స్థానంలో ఉండగా ఈ ఏడాది మరింత కిందికి చేరింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.
ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరింది, ఎన్‌పీఏ గవర్నమెంట్ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ కేటీఆర్ వ్యంగ్యం చేశారు. ఈ ఫెయిల్యూర్‌ను బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా శ్రీలంక (64వ ర్యాంక్), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99)తో భారత్ కన్నా ముందున్నాయి. దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ (109 ర్యాంక్) మాత్రమే భారత్ కన్నా దిగువన ఉంది.