mt_logo

నిర్మల్ జిల్లాలో రూ. 300 కోట్ల‌తో నిర్మించ‌నున్న పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో  రూ. 300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 

గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ల కోసం రైతులు తన్నుకునే వారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంటలు కొనుగోలు చేసినా చేయకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని తెలిపారు.  ఆయిల్ ఫామ్ పరిశ్రమతో ప్రతి ఒక్కరికి మంచి నూనె అందే అవకాశం ఉంది. తన నియోజకవర్గమైన సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత అన్నారు. 

నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ సాగు అని పేర్కొన్నారు. రివర్స్ పంపుతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారిందివచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు.