mt_logo

కాంగ్రెస్ హయాంలో తాగునీరు లేదు.. బీఆర్ఎస్ పాలనలో కరువు లేదు: మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో రూ. 300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కసారి కాదు 11 సార్లు 55 ఏండ్లు  ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారు, వారి హయాంలో తాగు సాగు నీరు అందలేదు, కేసీఆర్ పాలనలో ఒక్క సంవత్సరం కరువు కాటకాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంది. రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 ప్రారంభించాం.. త్వరలోనే చనాక కొరాట, సదర్మాట్ పూర్తి అవుతాయన్నారు. అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలన్నారు.