తన పుట్టిన రోజు సందర్భంగా “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం కింద ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్, కోచింగ్ మెటీరియల్‌తో కూడిన ట్యాబ్లెట్లను పంపిణీ చేస్తానని మంత్రి కేటీఆర్ తన బర్త్ డే రోజున హామీ ఇచ్చారు. ఈ హామీని వారంలో నెరవేర్చబోతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేయనున్న టాబ్లెట్‌ల చిత్రాలను మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోలతో పాటు… “రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు బైజు పవర్‌తో కూడిన సామ్‌సంగ్ టాబ్లెట్‌లను బహుమతిగా ఇస్తానని నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.