mt_logo

హైదారాబాద్‌లోని JNNURM & VAMBAY ఇండ్ల మరమ్మతులకు 100 కోట్ల రూపాయలు కేటాయింపు – మంత్రి కేటీఆర్

నగరంలోని జేఎన్ఎన్‌యుఆర్ఎం మరియు వాంబే  ఇండ్ల మరమ్మతులకు రూ.. 100 కోట్ల రూపాయలు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేటాయించారు. గతంలో జేఎన్ఎన్‌యూఆర్ఎం మరియు వాంబే పథకాల కింద పేదలకు అందించిన ఇండ్ల మరమత్తుల కోసం ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. HMDA అందించే రూ. 100 కోట్ల నిధులతో GHMC ఈ మరమ్మత్తు కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, పలువురు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.పేదలు నివసించే ఈ కాలనీలలోని ఇండ్ల కోసం అవసరమైన నిధులను వారు వెచ్చించుకునే అవకాశం లేదని, ప్రభుత్వమే వారికి అవసరమైన విధులను అందిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి చేసారు.

వేల సంఖ్యలో పేదలకు లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ. 9,100 కోట్ల రూపాయలతో నిర్మించి పేదలకు ఉచితంగా అందిస్తున్నామని, కొన్ని నిధులతో వేల సంఖ్యలో పేదలకు లబ్ధి చేకూరుతుందంటే ప్రభుత్వం ఏమాత్రం వెనకాడదని మంత్రి కేటీఆర్ అన్నారు. వెంటనే ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి 100 కోట్ల రూపాయల నిధులను పేదల ఇండ్ల మరమ్మతుల కోసం కేటాయించడం జరిగింది. నగరంలో జంగంమెట్, బండ్లగూడ వంటి పలు ప్రాంతాల్లో జేజేఎన్ఎన్‌యూఆర్ఎం మరియు వాంబే కాలనీలు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఇండ్లు దెబ్బతిని ఉన్నాయి, వీటికి వెంటనే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు అవసరమైన 100 కోట్ల రూపాయలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీకి అందిస్తుంది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది ఇందుకు సంబంధించిన మరమ్మత్తు కార్యక్రమాలను పూర్తి చేస్తారు.