mt_logo

మత చిచ్చు రాజకీయాలకు బీజేపీ తెరలేపింది… జాగరూకతతో ఉండండి : మంత్రి కేటీఆర్ ఆవేదన

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నాయకులు మత విద్వేష రాజకీయాలకి తెరలేపారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగ జమున తహజీబ్ లా ఉండే తెలంగాణ సమాజంలో కేంద్రం ఆజ్ఞలతో తెలంగాణ బీజేపీ ముఠా మత చిచ్చుని అంటిస్తున్నారని అన్నారు. ‘చదువురాని అజ్ఞాని అధ్యక్షుడు బండి సంజయ్ ఏమో మసీదులు తొవ్వండి, భగవద్గీత పట్టుకుంటే కోసేయండి, యువత తుపాకులతో రండి అని రెచ్చగొడుతుంటే.. అక్షరం ముక్కరాని మరో ఎమ్యెల్యే రాజాసింగ్ ఏమో పరమత దైవాన్ని బూతులతో దూషిస్తున్నాడు’ అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ని సస్పెండ్ డ్రామాతో కాపాడే ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. ఇలా ఇతర మతస్తులని బూతులు తిడుతూ, యువతని రెచ్చగొడుతున్న బీజేపీ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్ తెలంగాణ సమాజాన్ని హెచ్చరించారు. ‘బీజేపీ కుట్రని కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని అన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం… అనేది బీజేపీ అందమైన నినాదం మాత్రమేనని విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం అని మండిపడ్డారు. హర్ ఘర్ జల్ పేరుతో ప్రతి ఇంటికి మంచినీళ్లు అన్నరు కానీ.. హర్ ఘర్ జహార్ లాగా ప్రతి ఇంటికి విషం నింపుతున్నారని, హర్ దిల్ మేన్ జహార్ వలె ప్రతి మనసులో విషం నింపే కుట్ర చేస్తున్నారు’ అంటూ కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *