Mission Telangana

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం కింద నేడు సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక సాఫ్ట్‌వేర్, కోచింగ్ మెటీరియల్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా, విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్లలో ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే అడగకముందే సిరిసిల్ల జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు.

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని చెప్పారు. దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్‌ సైకిళ్లు అందించామని తెలిపారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ అందిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేస్తున్నాని వెల్లడిచారు. కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారికోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *