mt_logo

ఐ ఫోన్లకు అడ్డాగా.. తెలంగాణ గడ్డ – ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ

హైదరాబాద్‌: తైవాన్కు చెందిన ఫాక్సాకాన్ సంస్థ  తెలంగాణలో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. రూ.1,656 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఇక్కడ తయారీ కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ సిడ్నీ లూ తో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో దాదాపు 35 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్లు ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ కలిగినవి. యాపిల్ సంస్థ నుంచి భారీ ఆర్డర్ను ఫాక్స్కాన్ పొందదాంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 

 ప్రస్తుతం యాపిల్ ఐఫోన్లలో సుమారు 70శాతం ఫాక్సాకాన్ ఉత్పత్తి చేసినవే.ఇటీవలే యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది.  గతంలో కేవలం ఫోన్లు మాత్రమే తయారు చేస్తున్న ఫాక్సాకాన్ ఇక ముందు ఎయిర్పాడ్ల తయారీలోకి అడుగు పెడుతుంది.  ప్రస్తుతం చెన్నైలో ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్ కాన్ భారత్ లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని భావించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రగతిశీల విధానాలు, సులభతర విధానాలు ఫాక్సాకాన్ను ఆకట్టకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి ఫాక్సాకాన్ చైర్మన్ ను విశేషంగా ఆకర్షించిందని, అందుకే ఇతర రాష్ట్రాలు కాదని ఫాక్స్కాన్ భారత్ లో తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంచుకుందని అన్నారు.