Mission Telangana

రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు : మంత్రి కేటీఆర్ 

  • కొంగరకలాన్ లో Foxconn ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ
  • రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు 
  • ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుంది

హైదరాబాద్ లోని  కొంగరకలాన్ లో Foxconn ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు.  ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, Foxconn interconnect technology చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ.. 

 తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ చైర్మన్ సీడ్నీ లు మరియు కంపనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు,  కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. రానున్న తొమ్మిది నెలల్లోని ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందన్నారు. ఈరోజు ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుంది, ఈరోజు కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించెందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందింది.  గత తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని తెలిపారు. తెలంగాణ ఫర్ క్యాపిట 2.5 రెట్లు పెరిగింది దాదాపు 22, 700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించాము. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈరోజు భారతదేశం 30 సంవత్సరాల కింద చైనా ఉన్న పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వాలు అనుకుంటే 20 సంవత్సరాల్లోనే చైనా సాధించిన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉంది,  తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తే 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. 

500 మిలియన్ డాలర్లను తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు

   దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి తెలంగాణలోనే వచ్చింది. దేశంలో గత ఏడాది వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాలు 33% తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించింది.  చైనా మాదిరి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ వేగంపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మా పైన ఉన్నది. ఆ దిశగా పనిచేస్తామని మంత్రి అన్నారు. ఈ కంపెనీ తెలంగాణకి రావడంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, 500 మిలియన్ డాలర్లను తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.  ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీ  అనుభవాలకు work experience కి మించి అద్భుతమైన ప్రస్థానం ఇక్కడ కొనసాగుతుందన్న నమ్మకం ఉన్నదన్నారు.  తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నాయకత్వం వహించేలా.. మార్గదర్శకంగా ఉండేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నది, రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం.. అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా foxcon ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నన్నారు. 

Foxconn interconnect technology చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ కామెంట్స్

• ప్రపంచవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం

• తెలంగాణలో ఉన్న విస్తరమైన అవకాశాలను కంపెనీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది

• తమ కంపెనీకి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు

• ఈరోజు కంపెనీ శంకుస్థాపన ద్వారా తెలంగాణ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్ లో సుస్థిరమైన స్థానం సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం.