mt_logo

రేవంత్ ది క్షుద్ర రాజకీయం : మంత్రి జగదీశ్ రెడ్డి 

రేవంత్ ది క్షుద్ర రాజకీయం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.  బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్ ,టీడీపీ లదే అని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. యేళ్ళకేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తోంది. రేవంత్ ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ, కాంగ్రెస్ లకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు పిండం  తద్దినం పెట్టడం గురించి రేవంత్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కు ఎందుకు పిండం పెడుతావ్ ..పేదల బతుకుల్లో వెలుగులు  నింపుతున్నందుకా? అనడిగారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినందుకు కేసీఆర్ కు పిండం పెడతావా? తన ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణకు ప్రాణం పోసినందుకు కేసీఆర్ కు పిండం పెట్టాలనుకుంటున్నావా? రేవంత్ పిండం  పెట్టాలనుకుంటున్నది కేసీఆర్ కు కాదు.. తెలంగాణలో రేవంత్ ఇంకా తెలంగాణ ద్రోహుల చేతుల్లో ఉన్నారు అని అన్నారు. ప్రజలు ఊహించిన దాని కన్నా గొప్పగా పాలిస్తున్నందుకు కేసీఆర్ కు పిండం పెడతావా?  రాష్ట్రం నుంచి  ఆకలి ని పారదోలినందుకా? కేసీఆర్ కు పిండం పెట్టేది. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతావా?  అని అడిగారు. 

మాకు రావా మాటలు.. మాట్లాడలేమా? అన్నారు. మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు సరైన అంత్యక్రియలు  నిర్వహించని సంస్కారం లేని పార్టీ కి రేవంత్ అధ్యక్షుడు, ఎక్కడా దిక్కు లేక రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. చీమలు  పెట్టిన పుట్టలో పాముగా చేరాడు రేవంత్ అన్నారు. రేవంత్ మాట్లాడే భాషను కనీసం వాళ్ళ ఇంట్లో నైనా ఒప్పుకుంటారా?  50 లక్షల లంచం డబ్బుతో దొరికి టీడీపీ కి తద్దినం పెట్టినవ్.. కరెంటు తో పిచ్చి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కు తద్దినం పెట్టినావు..  కేసీఆర్ గనుక రాజకీయ కక్ష ప్రదర్శిస్తే  రేవంత్ వాడుతున్న భాష కు రోడ్ల మీద తిరిగేవాడా? అని ప్రశ్నించారు. రేపటి రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్ కు భంగపాటు తప్పదన్నారు. 

రేవంత్ ది క్షుద్ర రాజకీయం 

మాది కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బంధు భాష, మీది పిండాల భాష అన్నారు. ప్రజలను  చంపడం  సంపాదించుకోవడమే మీకు  అలవాటు,  ఇప్పటికైనా రేవంత్  రెడ్డి సరిగా మాట్లాడటం నేర్చుకో అని సూచించారు. నీ మాటలు కోట్లాది మందిని గాయపరుస్తున్నాయి. చరిత్రను నిర్మించిన కేసీఆర్ ను పట్టుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతావా?  ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కేసీఆర్ గురించి ఏం మాట్లాడారో తెలుసుకో అన్నారు. కేసీఆర్ గురించి రేవంత్ లాంటి క్షుద్ర రాజకీయాలు చేసే వారికి ఏం తెలుస్తుంది, కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమాపణ చెబితే మంచిదన్నారు.  

క్షమాపణ చెప్పకపోతే ఏం చేయాలో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. రేవంత్ లాంటి నేతలకు ఎంతో మందికి గతం లో పిండాలు తద్దినాలు పెట్టారు.  రాహుల్ వాడిన చిన్న మాటకే కోర్టు శిక్ష వేసింది, అంత కన్నా ఎన్నో రెట్లు  పరుష పదజాలం వాడుతున్న రేవంత్ పదవి పోవడానికి నిమిషం సమయం చాలన్నారు. కేసీఆర్ ఎవరి మీద కక్ష గట్టరు కనుక రేవంత్ కు రాహుల్ లా శిక్ష పడటం లేదన్నారు. జగన్ కే కాదు చంద్రబాబుకు కూడా ప్రగతి భవన్ లో  ఆతిధ్యం ఇచ్చామని గుర్తు చేసారు. తెలంగాణ వచ్చాక మాకు ఎవరితో శత్రుత్వం లేదన్నారు.  

గద్దర్ గురించి రేవంత్  మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది

గద్దర్ గురించి  అజ్ఞాని  రేవంత్ కు ఏం తెలుసని అడిగారు.  గద్దర్ జీవితం ఎవరికి వ్యతిరేకంగా మొదలైంది తెలుసా?  గద్దర్ చరిత్ర తీద్దామా?  గద్దర్ కు ఫలానా వారే నివాళుర్పించాలని ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. గద్దర్ మాతో కలిసి పని చేశారు. గద్దర్ ను అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేస్తోంది వాళ్ళే మేము కాదన్నారు. గద్దర్ గురించి మాట్లాడే అర్హత మాకే ఉందన్నారు. గద్దర్ ఆశయాలను చాలా నెరవేర్చాం.. పూర్తిగా  సాకారం చేస్తాం అన్నారు. గద్దర్ గురించి రేవంత్  మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. రేవంత్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఖతమే అన్నారు.  రేవంత్  అహంకారం అతి తెలివితో కాంగ్రెస్ ను కూడా మొత్తం ఖతం చేస్తారని అన్నారు.