-దమ్ముంటే కాంగ్రెస్ నేతలను కలిసి నడిపించు రేవంత్
రేవంత్ రెడ్డే కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు.. ఆదివాసీ ,గిరిజనులు అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల ప్రగతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెరిగిందన్నారు. ఆదివాసీలకు తెలంగాణ వచ్చాకే మేలు జరిగింది. రేవంత్ రెడ్డి అసహనం తో మాట్లాడుతున్నారు. ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ ని బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ కు అలవాటే అన్నారు. రేవంత్ రెడ్డి యే కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ వాది అని పదే పదే చెప్పుకుంటున్నారు. రేవంత్ తెలంగాణ కోసం చేసిన ఓ గొప్ప పని ఏమిటో చెప్పగలరా? అని అడిగారు. రేవంత్ చేతిలో 2018 కన్నా ఘోరమైన పరిస్థితి 2023 లో కాంగ్రెస్ కు రాబోతోంది. రేవంత్ బతుకేందో అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు, నిక్కర్ లిక్కర్ పార్టీ ఒక్కటి అయ్యాయి అంటున్నవ్.. నీది చీటర్స్ పార్టీ యా ? గద్దర్ గౌరవాన్ని రేవంత్ తగ్గిస్తున్నారని అన్నారు.
మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల కు గద్దర్ అంత్యక్రియల పై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు
గద్దర్ కు శాసనసభలో సభ్యుడు కాకున్నా సంతాపం తెలిపామని గుర్తు చేసారు. కౌన్సిల్ లో కూడా తెలిపాం అన్నారు. మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల కు గద్దర్ అంత్యక్రియల పై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అధికారికంగా అంత్యక్రియలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని తెలియజేసారు. గద్దర్ కాంగ్రెస్ పార్టీ యా? వేరే పార్టీ యా? అని కాదు.. ఆయన అందరి మనిషి, గద్దర్ కాంగ్రెస్ పార్టీ అయితే కే ఏ పాల్ పార్టీ లోకి ఎందుకు వెళ్లారని అడిగారు. గద్దర్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇస్తే.. కొత్త పార్టీ కోసం ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు.
గద్దర్ మరణాన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తానంటే కుదరదన్నారు. రేవంత్ ఇకనైనా భాష మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ కు పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను దించలేని పరిస్థితి రేవంత్ ది, ఎన్నికల దాకా కాంగ్రెస్ నేతలను కలిసి నడిపించు రేవంత్ దమ్ముంటే అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఆదివాసీలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం, ఆదివాసీలను అన్నింటా వెనకబడేసింది కాంగ్రెస్ పార్టీ యే అన్నారు. గిరిజన ఆదివాసీలు వెనకబడటం లో ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు.