mt_logo

బూతు మాటల నాయకులకు, బూతుల్లోనే సమాధానం చెప్పాలి: మంత్రి హరీష్ రావు

బూతు మాటల నాయకులకు, బూతుల్లోనే సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు సూచించారు. నిజామాబాద్ అర్బన్ రోడ్ షో లో మంత్రి మాట్లాడుతూ.. గులాబీ జెండా రాకముందు ఎలా ఉండే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని అడిగారు. కేసీఆర్ రాకముందు నిజామాబాద్ ఎలా ఉండే ఇప్పుడు ఎంత మారిందని అన్నారు. రఘునాథ్ చెరువు అద్భుతంగా అభివృద్ధి చేశారు గణేష్ బిగాల అని తెలిపారు. కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్.. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బొడి మల్లన్న అన్నట్టుందని ఎద్దేవా చేసారు. 

నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారని హెచ్చరించారు. ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఓట్లు డబ్బాలో పడితే ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం. లేదంటే అందరం బాధ పడతాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కాకమ్మ కథలు నమ్మొద్దు. మోస పోతాం అని తేల్చి చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అని తేల్చి చెప్పారు. షబ్బీర్ అలీ కామారెడ్డిలో గెలవలేదు, ఎల్లారెడ్డిలో గెలవలేదు. ఇక్కడకు వచ్చిండు. అక్కడ చెల్లని షబ్బీర్ అలీ ఇక్కడ ఎలా చెల్లుతడని మంత్రి హరీష్ రావు అడిగారు.