mt_logo

మోడీ పెంచిన సిలిండర్ ధరను కేసీఆర్ తగ్గిస్తుండు: కామారెడ్డిలో మంత్రి కేటీఆర్

కామారెడ్డి: భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.  బోనాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామ గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉండే ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో ఇంత వరి ధాన్యం పండుతుండేనా? అని ప్రశ్నించారు. గత రెండు సార్లు గెలిచిన తర్వాత రాష్ట్రంను అభివృద్ధి చేసుకున్నాం అని తెలిపారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే అని ధీమా వ్యక్తం చేసారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చిన చందంగా కామారెడ్డికి కేసీఆర్ వస్తుండని అన్నారు.

మోడీ పెంచిన సిలిండర్ ధరను కేసీఆర్ తగ్గిస్తుండు. మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాకా 5 వేలు పెన్షన్ ఇస్తాడని వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తాం. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 3 వేల పెన్షన్ ఇస్తాం. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ ధరణినీ రద్దు చేసి మళ్ళీ పట్వారీ వ్యవస్థ తెస్తా అంటున్నారని హెచ్చరించారు. మనకు మూడు గంటల కరెంట్ కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా ఆలోచించాలని సూచించారు. మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డి వస్తే ఇక్కడి రూపురేఖలు మారుతాయి. 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు.