mt_logo

కత్తి పోటుపై కూడా ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు: మంత్రి హరీష్ రావు

కత్తి దాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని మంగళవారం మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కొంత స్టేబుల్‌గా ఉందని వెల్లడించారు. వైద్యులు నిరంతరం ఆరోగ్యం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. 

సీనియర్ నాయకులు కూడా చిల్లర కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కొడికత్తి అని రాజకీయాలు అపహాస్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అవసరం లేదన్నారు. కడుపులో చిన్న పేగు నాలుగు చోట్ల రంధ్రాలు పడితే, తొలగిస్తే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతారా? అని అడిగారు. ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయి. దిగజారిపోయి మాట్లాడుతున్నాయని తెలిపారు. 

15 సెంటీ మీటర్లు ఓపెన్ చేసి, సర్జరీ చేసి పేగు కట్ చేసి తొలగించారని వెల్లడించారు. ఈ రకంగా మాట్లాడటం దివాలకోరు రాజకీమన్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్ డేటా సేకరించారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సూచించారు.  ఒకటి రెండు రోజుల్లో కుట్ర కోణం చేధిస్తారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. 

తెలంగాణలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదని స్పష్టం చేసారు. ఇలాంటి హత్యా రాజకీయాలను రాయలసీమ, బీహార్‌లో చూశామన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నికల సమయంలో ఇలా దాడులు లేవని తెలియజేసారు. వ్యక్తుల పై కేసులు పెట్టే ప్రయత్నం లేదు,  పనితనం తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలా పగ ఉంటే ఇప్పటికీ ఎంతో మంది జైళ్లలో ఉండేవారన్నారు. 

కాంగ్రెస్ నాయకులు హౌసింగ్ స్కాంలో వందల కోట్లు మెక్కారు. అందరినీ లోపల వేసేవాళ్ళం. అలా ఓటుకు నోటు కేసు ఉంది. ఏనాడు ఇలాంటివి మేము పాల్పడలేదని తెలిపారు. ఏదేమైనా ఇలాంటివి జరగటం దురదృష్టకరం. ప్రతి పక్షాలు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు.  తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. న్యాయ వ్యవస్థ పై మాకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.