కామారెడ్డి నియోజకవర్గ మాచారెడ్డి మండల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారనగానే ప్రతిపక్షాలు నీరుగారిపోయాయి. పోటీ చేసేందుకు వెనుకాడూతూ పారిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి రోజు నుంచి తెలంగాణ ఉద్యమ జెండా ఎగిరిన గడ్డ కామారెడ్డి, అందుకే ఇయాల కామారెడ్డిలో కేసీఆర్ పోటీతో ప్రతిపక్షాల పరిస్థితి పోచమ్మ గుడి ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్లు తయారయిందన్నారు. ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గం అవుతుందని కామారెడ్డి ప్రజలు నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేసారు. ఇంకా కామారెడ్డిలో అఖండ మెజార్టీతో కేసీఆర్ విజయం ఖాయమన్నారు.
గంప గోవర్ధన్ స్వయంగా కేసీఆర్‌ని పోటీ చేయాలని కోరిన నేపథ్యంలో కేసీఆర్‌ని కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. రానున్న తొమ్మిది నెలల కాలంలోనే కామారెడ్డికి గోదావరి జిల్లాలు వస్తాయి. మద్దిమల్ల నుంచి మచరెడ్డి కి నీళ్ళు రావాలి… 6-9 నెలల్లో నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు కడుగుతామని తెలిపారు. జల్ జంగల్ జమీన్ అన్న ఇవాళ నినాదాన్ని అర్థవంతంగా అమలులో చూపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం అని తేల్చి చెప్పారు.
కొడంగల్‌లోనే ఓడిపోయి పారిపోయిన రేవంత్ రెడ్డి, కామారెడ్డికి వచ్చి గెలుస్తానని అంటుండు. కొడంగల్‌లో మా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పైనే గెలవలేని రేవంత్ రెడ్డి, కేసిఆర్ పై పోటీ చేస్తారని బీరాలు పలుకుతుండు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు చేసి ఉద్యమ వేడి చూపిస్తాం. బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందుకొచ్చి తొడగొట్టినట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. 11 సార్లు అవకాశం ఇచ్చిన ఏం చేయలేని కాంగ్రెస్ పార్టీ… మరొక్కసారి అవకాశం అడుగుతుంది
ప్రతిదానికీ ఢిల్లీ వెళ్లి తెల్చుకునే కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు మనకెందుకని అన్నారు. గతంలో రైతులు వ్యవసాయానికి, కరెంట్ కోతలతో కష్టాలు పడింది మర్చిపోవద్దని సూచించారు. అందరికీ మనం ఒక్కసారి కాంగ్రెస్ చీకటి రోజులు రావన్న, రైతులు అర్ధరాత్రి బోర్ల దగ్గర పడుకునే పరిస్థితి రావాల్నా ఆలోచించాలన్నారు. ఎవరి గ్రామాల్లో వారు పార్టీ పథకాలను ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తులో అందించే సంక్షేమ కార్యక్రమాలను, ప్రతి ఒక్కరికి తెలిపి మెజార్టీ తీసుకువచ్చేలా చూడాలి