mt_logo

మీరు చేస్తున్న సేవలు అమూల్యం : మంత్రి హ‌రీశ్‌రావు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవా సిబ్బందికి మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న సేవలు అమూల్యం అన్నారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, ఆరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయం. వానలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానన్నారు.