mt_logo

బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: మంత్రి హరీశ్ రావు

నారాయణ పేట జిల్లా మక్తల్‌లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజనీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మక్తల్ ఆకుపచ్చ మక్తల్ అయ్యిందన్నారు. గతంలో ఒకరు పలకలు వేస్తే ఒకరు కొబ్బరి కాయ కొట్టారు. కానీ మా పాలనలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. 

మోదీ పూటకు ఒక మాట, రాష్ట్రానికి ఒక మాట

నాందేడ్ ఆసుపత్రిలో 2 రోజుల్లో 30 మంది పసి పిల్లలు చనిపోయారు.  బీజేపీ పాలన డబుల్ ఇంజన్ పాలనలో పిల్లలు వైద్యం అందక చనిపోయారని గుర్తు చేశారు. మోదీ పూటకు ఒక మాట, రాష్ట్రానికి ఒక మాట చెప్తారని అన్నారు. అంతకు ముందు కేసీఆర్ ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతారు అని పార్లమెంట్‌లో చెప్పారు. ఇక్కడికి వచ్చి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట.కుటుంబ రాజకీయాల గురించి మీరు మాట్లాడడం శోచనీయం. మేము ప్రజలు గెలిపిస్తే రాజకీయాల్లోకి చట్టసభల్లోకి వచ్చాం. దొడ్డిదారిన రాలేదు. 

గురువింద గింజ నీతులు చెప్పడం సరికాదు

ఒకవేళ కుటుంబ రాజకీయాలు మీరు వ్యతిరేకమైతే మీ మంత్రి వర్గంలో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ రాణే, పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకూర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ కొడుకు.. అమిత్‌ షా పుత్రరత్నం జై షా.. ఎంత మంది లేరు మీ పార్టీలో. గురువింద గింజ నీతులు చెప్పడం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి సరికాదు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కేంద్ర పదవులు ఇస్తున్నారు మీరని అన్నారు. నిన్న మోదీ తన స్థాయి దిగి మాట్లాడిండని మంది పడ్డారు. ఎవరు ఎవరికి బి టీమ్, కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ టీం కాదు ప్రజల టీం అని తెలిపారు. కేసీఆర్ పని ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్‌లు, 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. 24 గంటలు కావాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించండి. 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ గెలిపించండి.మూడు గంటల కరెంటు చాలు అన్న రోజే తెలంగాణలో రేవంత్ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది. కర్ణాటకలో ఎన్నికల సమయంలో చెప్పిన గ్యారెంటీలు అమలు చేయడం కష్టంగా ఉందని, అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తెలంగాణ జైత్ర యాత్ర లేదా నా శవయాత్ర అని  కేసీఆర్ గారు నాడు ఆమరణ దీక్ష చేశారు. డిల్లీ కదిలించి తెలంగాణ తెచ్చారని గుర్తు చేసారు. 

అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ 

మాట అంటే కేసీఆర్ తప్పుడు. తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యేనా..రేవంత్ కు కేసీఆర్ పెట్టిన భిక్ష పీసీసీ అధ్యక్ష పదవి. అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంది. అక్కడ సీఎం గారు మేనిఫెస్టో ప్రకటిస్తారు. మన మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది. శుభవార్త వినడానికి ప్రజలందరు సిద్దంగా ఉండండి. బిజెపి వాడు గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడుతారు. కాంగ్రెస్ వాడు గెలిస్తే ఉత్త కరెంట్ అవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ దోచుకుంటున్నది. తప్పిపోయి కాంగ్రెస్ వస్తే బ్రోకర్ రాజ్యం, పైరవీల రాజ్యం వస్తది. 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన గొప్ప ఎమ్మెల్యే రామ్మోహన్.  జీవితం ధన్యం అయ్యింది. పాలమూరు నీళ్ళు వస్తే రెండు పంటలు సాధ్యం.  మళ్ళీ గెలిపించండి. మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.