mt_logo

సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి 2653 కోట్లు – శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి,జూన్7: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సాగునీటి దినోత్సవం లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.మునిపల్లి మండలం చిన్న చెల్మెడ లో మంత్రి సంగమేశ్వర ఎత్తిపోతల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి హరీష్ రావు. ఈ ప్రాజెక్టును  2653 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు. 2 పంప్ హౌస్ లు, 12 కాల్వల నిర్మాణం, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ఈ ప్రాజెక్టు యొక్క విశేషం.  ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఆనాటి ఉమ్మడి పాలకులు సంగారెడ్డి జిల్లాలో సింగూరు కట్టి నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయారు, భూములు మనవి పోయినయి.. నీళ్లు వాళ్ళు తీసుకుపోయిర్రన్నారు. 

ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటే కేసీఆర్ పండుగ చేసి చూపించారు, రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది..మద్దతు ధర ఇస్తుంది. పేదలు, రైతుల సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంగమేశ్వర పథకానికి భూములు ఇచ్చిన రైతులకు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం అని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు చాలా మంది వస్తుంటారు, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతిలో ఉంటే బాగుంటుందని, వేరే వాళ్ళ చేతికి పోతే తెలంగాణ ఆగం అవుతుందని హెచ్చరించారు.