mt_logo

అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తాం.. బట్టలూడదీసి కొడతాం.. దమ్ముంటే కాస్కో..

  • నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం
  • ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరియర్ క్లోజు
  • అడ్డగోలుగా వాగితే నీ నాలుక చీరేస్తాం
  • అంబేద్కర్ చౌరస్తా లో బట్టలూడదీసి కొడతాం
  • కవితక్కపై నీకెందుకంత అక్కసు
  • మంత్రి కేటీఆర్ ని విమర్శించే స్తాయా నీది
  • అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది ఎంపీ అరవింద్ రూపం
  • కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
  • ఎంపీ అరవింద్ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  • నందిపేట్ మండలానికి చెందిన వందలాది మంది  బీఆర్ఎస్ లో చేరిక

ఆర్మూర్, జూన్7:- నిజామాబాద్ ఎంపీ అరవింద్..నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ లో నాపై పోటీ చెయ్యి. నాతో యుద్దానికి సిద్ధమా?. తొడగొట్టి చెబుతున్నా నిన్ను పడగొట్టి పాతి పెడతా.. నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం.ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరీర్ క్లోజు” అని  పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన  500 మందికి పైగా  యువకులు, వివిధ కుల సంఘాల నాయకులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తామంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థవంత పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వానికి వారు మద్దతు పలికారు.

 అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో  ఆయన సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చు కున్నారు.  వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి  బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు.  బీఆర్ఎస్ గూటికి చేరిన యువకులు  “దేశ్ కీ నేత కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అని చేసిన నినాదాలతో అంకాపూర్ మారుమోగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ అడ్డగోలుగా వాగితే  నాలుక చీరేస్తాం. అంబేద్కర్ చౌరస్తా లో బట్టలూడదీసి కొడతాం అని హెచ్చరించారు. నీకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధి పై చర్చకురా. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో నీ వాటా ఎంతో చెప్పు. 3వేల కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. 

ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సీడీలే రూ.320కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.3016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి.62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది.12వందల మందికి దళితబంధు స్కీమ్ ద్వారా ద్వారా రూ. 10 లక్షల చొప్పున వచ్చి వారికిష్టమైన యూనిట్లు పెట్టుకొని ఆత్మ గౌరవ పతాకను ఎగురేస్తున్నారు.కేసీఆర్ సర్కారుకు సకల కులాలూ సమానమే.ఆర్మూర్ లో వివిధ కులాలకు 17 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేస్తున్నాం. గృహలక్ష్మీ ద్వారా 3వేల ఇండ్ల నిర్మాణం చేపడతాం. 4వేల మందికి కొత్తగా ఇండ్ల స్థలాలుపంపిణీ చేస్తాం. సిద్ధులగుట్ట కు రూ. 20కోట్లతో ఘాటు రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశా. సిద్ధులగుట్టను దేశంలోనే అధ్బుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చి దిద్దా. రూ. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించా. నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించా. ఆర్మూర్- నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్ కు రోడ్లు నిర్మించా. కొత్తగా డొంకేశ్వర్, ఆలూరులను మండలాలుగా మార్పించా. గొల్ల, కురుమ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయించా. రైతు బీమా వస్తోంది.

450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం నియోజకవర్గంలోని 81 గ్రామాలకు, 36 వార్డులకు ఇంటింటికీ మిషన్ భగీరథ మంచి నీళ్లు సరఫరా చేస్తున్నాం.  ఒకప్పుడు కేవలం మంచినీళ్ల కోసం రాజారామ్ నగర్ లో హత్య జరిగినటువంటి దారుణ పరిస్థితులు ఇప్పుడు లేవు. గురుకుల పాఠశాలల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్షా 25వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇంగ్లీషు మీడియంలో విద్య నేర్పిస్తున్నాం. రూ. 120కోట్లతో పత్తేపూర్-చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించా. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఒక లక్షా 116 రూపాయల చొప్పున ఇస్తూ 15వేల నుంచి 20వేల మంది పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు జరిపించాం. గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేశా. నాయీ బ్రాహ్మణ, రజక సోదరులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 

అంబేద్కర్ స్పూర్తితో మా పాలన సాగుతోంది. పరిపాలన రధమైన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాం. 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టించి భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళి అర్పించాం. కేసీఆర్ గారిది సుభిక్ష పాలన. ఆయన సాధించిన తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం. తెలంగాణ పథకాలు తమకూ కావాలని అన్ని రాష్ట్రాలూ అడుగుతున్నాయి. మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఏ తల్లి, ఏ చెల్లిని అడిగినా మా ఇంటి పెద్ద కొడుకులా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. తామంతా సారు, కారు, కేసీఆర్, బీఆర్ఎస్ వైపే అని అంటున్నారు. నాలుగేళ్లు ముఖం చాటేసి ఇప్పుడు ఆర్మూర్ వచ్చిన ఎంపీ అరవింద్ ను ఎవరూ పట్టించుకోరు.

పసుపుబోర్డు తేకుండా రైతుల వెన్ను విరిచిన మోసగాడు.ఆర్మూర్ లో అరవింద్ చేసింది రోడ్ షో కాదు మ్యాడ్ షో. అదొక బ్యాడ్ షో. ఆర్మూర్ ను నిండా ముంచే కుట్రతో చేసిన వెకిలి చేష్టలు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బొంద పెడతాం. కర్ణాటక ప్రజలు చెప్పుతో కొట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు. అరగుండు అరవింద్ ఎన్ని చిల్లర వేషాలేసినా నేను 60వేల మెజారిటీతో మూడోసారి కూడా గెలుస్తా. కవితక్కపై నీకెందుకంత అక్కసు.మంత్రి కేటీఆర్ ని విమర్శించే స్తాయా నీది. వారి కాలిగోటికి కూడా అరవింద్ సరిపోడు.కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం.అభివృద్ధి, సంక్షేమం చూసి సకల జనుల మద్దతు బీఆర్ఎస్ కే లభిస్తోంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.