mt_logo

వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ మాత్రం సిక్సర్ కొట్టడం ఖాయం: మంత్రి హరీశ్ రావు

జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అయితే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అనే మార్పు వచ్చిందన్నారు. జగిత్యాల మెడికల్ కాలేజీ, కోరుట్ల వంద పడకల ఆసుపత్రి, పల్లె దవాఖానలు,  సిటీ స్కాన్ మంజూరు చేస్తామన్నారు. మరో 3 డయాలసిస్ పడకలు కూడా పెంచుతాం. మారో ఫ్లోర్ వేసేలా సహకరిస్తామన్నారు. 

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. చర్చ అని. మేము సిద్ధమని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ చర్చకు మేము సిద్ధం, పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంట్ బాధలు తీర్చింది కేసీఆర్ కాదా? అని అడిగారు. ఆనాటి కరెంట్ బాగుంటే కాంగ్రెస్‌కి ఈనాటి కరెంట్ బాగుంటే బీఆర్ఎస్‌కు వేయాలి. నాటి కాంగ్రెస్ పాలనలో నీళ్ళు ఎలా ఉండే నేడు ఎలా వస్తున్నాయని అన్నారు. లీకేజీ వాటర్ కోసం ధర్నాలు, ఎస్సారెస్పీ కి కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది వాస్తవం కాదా? అని అన్నారు. 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వచ్చే ఎన్నికల్లో పోటీ 

నీళ్ళల్లో, పంటలో, కరెంట్‌లో ఇలా.. ఎందులో పోటీ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కేసీఆర్ కిట్టు, డయాలసిస్ సెంటర్లు, న్యూట్రిషన్ కిట్లు ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. 12 లక్షల 70 వేల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా 11 వేల కోట్లు ఇచ్చింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వచ్చే ఎన్నికల్లో పోటీ అని అన్నారు. బీజేపీ డక్ అవుట్ అవుతుంది,  కాంగ్రెస్ రన్ అవుట్ అవుతుంది,  సీఎం సిక్సర్ కొడతారని అన్నారు. 

నాడు నిజమా? నేడు నిజమా?

బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చి కాపాడుతున్నది కేసీఆర్, కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం అన్నారు. పార్టీ మారి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నాడు వైఎస్ చనిపోతే పావురాల గుట్టలో పావురం అయ్యాడు అన్నావు. నేడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. నాడు మాట్లాడింది నిజమా, నేడు మాట్లాడేది నిజమా. ఊసరవెల్లి రేవంత్ రెడ్డి ఎన్నీ ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ గెలుపు పక్క.హ్యాట్రిక్ పక్కా అని అన్నారు.