mt_logo

కర్ణాటక అవినీతి సొమ్ముతో మోసం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త: మంత్రి హరీశ్ రావు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు మీరు వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అలాంటి కష్టం ఉందొద్దని 100 పడకల పెద్దాసుపత్రి తెచ్చామని అన్నారు. రూ. 33 కోట్లతో ఈ ఆసుపత్రి ఏడాదిలో పూర్తి చేస్తాం. ఎమ్మెల్యే కోరిక ప్రకారం ఎంసీహెచ్ సేవలు కూడా తెస్తామని అన్నారు. 

తెలంగాణ నుండే ఏటా 10 వేల డాక్టర్లు 

కాంగ్రెస్ పాలనలో మందులు లేవు, డాక్టరులు లేరు. పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, వంద పడకల ఆసుపత్రి, జిల్లాకో మెడికల్ కాలేజీ, నాలుగు టిమ్స్ ఆసుపత్రులు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం ఉంటే, నేడు 76 శాతంకు పెరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 1200 ఓపీ ఉంటున్నది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలపై నమ్మకం లేదు. ఇప్పుడు ఆ నమ్మకం వచ్చింది. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారు డాక్టర్ చదువు అంటే నాడు ధనికుల చదువు. నేడు పేదలకు కూడా చేరువైన చదువు. తెలంగాణలో ఏటా 10 వేల డాక్టర్లు తయారు చేసే పరిస్థితి ఉందని తెలిపారు. 

ఎండాకాలం వస్తే ఇక్కడ నీళ్ల కొరత ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న. ముందు నీళ్ళ టాంకర్ బండి వెళ్ళాకే, ఎమ్మెల్యే వెళ్లేవాడు. నాడు నీళ్ళు మోసి భుజాలు పోయేది మా అక్కా చెల్లెళ్లకు. గెలిచిన తర్వాత చెప్పింది కళ్యాణ లక్ష్మి ఎన్నికల ముందు చెప్పింది కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ పెళ్లికి ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.మహిళలు బలంగా ఉండాలని కేసీఅర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇస్తున్నడు. 72 మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ ప్రారంబించారు. అంతకుముందు ఒక్కటి లేకుండే. 13 రాష్ట్రాల్లో బీడీలు చేస్తే, ఎక్కడా ఏ ప్రభుత్వం వారినీ పట్టించుకోలేదని అన్నారు. 

తెలంగాణపై వారికి అవగాహన ఉంటుందా?

సీఎం 2000 రూపాయల ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. బీడీ కార్మికులకు పని లేకుండా చేస్తున్నారు. బిజెపి జీఎస్టీ వేస్తే, కాంగ్రెస్ పుర్రె గుర్తు పెట్టింది. కేసీఆర్ అంటే నమ్మకం. రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉంది. మోడీకి, రాహుల్ గాంధీకి తెలంగాణపై అవగాహన ఉంటుందా? అని అడిగారు. తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే శవయాత్ర అంటూ బయలుదేరి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. 12 లక్షల 70 వేల పెళ్లిళ్లకు 11 వేల కోట్లు ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. కరోనా సమయంలో ఎంత కష్టం ఉన్నా, రైతులకు రైతు బంధు ఆపొద్దని సీఎం ఆదేశించారు. ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చింది వాస్తవం. పండిన ప్రతి పంట కొన్నది వాస్తవం.  మోసపోతే ఆగం అవుతామని అన్నారు. 

కైలాసం ఆట లెక్క పెద్ద పాము మింగే అవకాశం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. పాతాళ లోకం నుండి కేసీఆర్ అద్భుతంగా తెలంగాణను పైకి తెచ్చారు. త్వరలో ప్రతిపక్షాల దిమ్మ దిరిగే మేనిఫెస్టో ఉంటుంది. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే అని అన్నారు.  కర్ణాటక అవినీతి సొమ్ముతో మోసం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త అని పేర్కొన్నారు.