mt_logo

కొత్త డ్రామాకు తెర తీస్తున్న రఘునందన్: మంత్రి హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి అక్బర్‌పేట రోడ్ షోలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అక్బర్‌పేట మండలం ప్రభాకర్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శివుడు నెత్తి మీద గంగమ్మ ఉన్నట్లు మనకు మల్లన్న సాగర్‌ను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని వెల్లడించారు. కేసీఆర్ వచ్చాక ఒక్క గుంట కూడా ఎండటం లేదని స్పష్టం చేసారు. బంగారం లెక్క పంట వండుతున్నది ఊరికి కాంటాలు పెట్టి పంట కొనుగోలు చేస్తున్నారు. కారుకు ఓటేసి మీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

భూములు గుంజు కుంటామని రఘునందన్ కొత్త డ్రామాకు తెర తీస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసింది ఏం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం భూములను ఎందుకు గుంజుకుంటుంది.? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు ఇచ్చేలా పట్టాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.  మనది అద్భుతమైన మ్మెనిఫెస్టో. ప్రజలకు వివరించాలని కోరారు. మంచి మనిషి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేసారు.